నిహారిక వెడ్డింగ్ కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్..!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మ్యారేజ్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజి కుమారుడు కొన్నలగడ్డ చైతన్యతో నిహారిక లైఫ్ షేర్ చేసుకుంటుంది. డిసెంబర్ 9న రాత్రి 7:15 నిమిషాలకు వీరి వివాహం జరబోతుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో చైతన్య, నిహారికల మ్యారేజ్ జరుగనుంది. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ్యారేజ్ తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీలో పెళ్లిసందడి మొదలైంది. ఇప్పటికే నిహారిక పెళ్లికి ముందు పార్టీలతో సందడి చేస్తుంది.