అఖిల్ డబుల్ ధమాకా..?

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న అక్కినేని అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా త్వరలో షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ కథతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ డబుల్ యాక్షన్ చేస్తాడని తెలుస్తుంది. అఖిల్ కెరియర్ లో ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తుంది. ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలో స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.