
రాజమౌళి.. ప్రభాస్ ఈ కాంబినేషన్ సినిమా అంటే అందరికి గుర్తొచ్చే సినిమా బాహుబలి. ఆల్రెడీ ఛత్రపతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ రాజమౌళి కాంబో బాహుబలితో సెన్సేషన్స్ క్రియేట్ చేశారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన సినిమా అది. ఇండియన్ సినిమా ఈక్వల్ టూ హాలీవుడ్ సినిమా అనేలా స్టామినా చూపింది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను ఆదరించారు వరల్డ్ సినీ లవర్స్. ఇక అలాంటి కాంబో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎక్సయిటింగ్ గా ఉన్నారు.
ఇదే విషయాన్ని రాజమౌళిని అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ప్రభాస్ ని మరోసారి డైరెక్ట్ చేస్తారా అని అడిగితే వామ్మో మళ్ళీ ప్రభాస్ తోనా.. బాహుబలి కోసం దాదపు 5 ఏళ్ళు కలిసి చేశాం.. మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియెన్స్ తలలు పట్టుకుంటారు. ముందు సరదాగా రియాక్ట్ అయిన రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయడం నాకు ఇష్టమే.. మంచి కథ దొరికితే తప్పకుండా మేం కలిసి చేస్తాం అన్నారు రాజమౌలి. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఆ సినిమాతో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు.