
బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న భారీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే. సినిమా నుండి వచ్చిన రెండు టీజర్ను ఆ అంచనాలు డబుల్ అయ్యేలా చేశారు. ఇక లేటెస్ట్ గా చిత్రయూనిట్ ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ ఫినిష్ చేశారని తెలుస్తుంది. 50 రోజుల నైట్ షూట్ చేసి మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరిపారట.
కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్, రామరాజు పాత్రలో రాం చరణ్ ఇద్దరు కలిసే ఈ సన్నివేశం సిన్మిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. 25 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ను బాహుబలి కాదు కాదు అంతకుమించి అనిపించేలా ఉండాలని కష్టపడుతున్నాడని తెలుస్తుంది.