
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతం కిచ్లుతో పరిచయం.. ప్రేమ వ్యవహారాల గురించి నోరు విప్పింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా 10 ఏళ్ళుగా గౌతం తెలుసని.. అయితే 7 ఏళ్ళుగా అతను తనకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని అన్నారు కాజల్. అంతేకాదు నాలుగేళ్ళుగా అతనితో కాజల్ డేటింగ్ లో ఉందట. ఇద్దరి అభిప్రాయాలు కలిసి పెద్దలకు చెబితే వారు ఓకే అన్నారని. కొన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసి చివరకు పెళ్లితో ఒకటయ్యాం అని చెప్పి షాక్ ఇచ్చింది కాజల్.
అంటే తను డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల టైం లోనే ఆమె తన డార్లింగ్ ను వెతుక్కుని అతనే తన మిస్టర్ పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యింది. ఇన్నాళ్ళు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన కాజల్ పెళ్లి తర్వాత ఈ విషయాలను చెప్పి సర్ ప్రైజ్ చేసింది. 15 ఏళ్లుగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ ఇన్నాళ్ళు సీక్రెట్ లవ్ ఎపిసోడ్ నడిపించిన విషయం తెలిసి అమ్మడు తక్కువదేమి కాదని అనుకుంటున్నారు ఆడియెన్స్.