
గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోనగన్నా రెడ్డి పాత్రలో అలరించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అనుష్క లీడ్ రోల్ చేసినా సరే బన్నీ చేసిన ఆ కొద్ది పాత్రకు మంచి పేరు తెచ్చి పెట్టింది. గోన గన్నారెడ్డి యాస భాష ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గుణశేఖర్ ఆ పాత్రని చాలా బాగా డిజైన్ చేశారు. ఇక ఇప్పుడు అతని జీవిత కథని సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ.
ప్రముఖ నిర్మాణ సంస్థ బాలకృష్ణతో గోన గన్నారెడ్డి బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్నారట. చారిత్రాత్మక కథ కాబట్టి బాలకృష్ణ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తర్వాత బి.గోపాల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.