సంక్రాంతికి సినిమాల పండుగ..!

ఏడు నెలలుగా థియేటర్లు బంద్ అవడంతో సినిమాలు రిలీజ్ అవకుండా ఉన్నాయి. అయితే థియేటర్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ వచ్చినా సరే ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేదు. ఇక ఈ ఇయర్ ఎలాగు థియేటర్లలో సినిమాల రిలీజ్ కష్టమని భావించి 2021కే టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి రేసులో ముచ్చటగా మూడు సినిమాలు రిలీజ్ ఎనౌన్స్ చేశాయి.

అఖిల్ బ్యాచ్ లర్, రవితేజ క్రాక్, రామ్ రెడ్ ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ మూడు సినిమాలు క్రెజీగా ఉన్నాయి. అఖిల్ బ్యాచ్ లర్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రవితేజ క్రాక్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. గోపిచంద్ మలినేని డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. రామ్ రెడ్ ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా వస్తుంది. ఈ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జానర్ లో వస్తున్నాయి. ఇక వీటితో పాటుగా నితిన్ రంగ్ దే సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. మరి 3 సినిమాలు ఎలాంటి సందడి చేస్తాయో చూడాలి.