ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్దే లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందే రాధే శ్యామ్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య అని తెలుస్తుంది. ప్రేమ కోసం పట్టువీడని విక్రమార్కుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని చెప్పొచ్చు. ఈమధ్యనే సినిమా నుండి పూజా హెగ్దే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రేరణగా పూజా హెగ్దే ఫస్ట్ లుక్ అదిరిపోయింది. రాధే శ్యామ్ ప్రభాస్, పూజా హెగ్దేల ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రభాస్ బర్త్ డే రోజు సినిమా టీజర్ వస్తుందా లేదా అన్నది మాత్రం రివీల్ చేయలేదు.