చిరంజీవి కోసం ముఖ్యమంత్రి కథ

మెగాస్టార్ చిరంజీవితో వినాయక్ సినిమా అంటే పక్కా హిట్ అన్నట్టే. ఈ కాంబో సెట్ అయిన రెండు సార్లు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. రమణ రీమేక్ గా వచ్చిన ఠాగూర్, కత్తి రీమేక్ గా వచ్చిన ఖైది నంబర్ 150 రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి రీమేక్ మూవీ చేస్తున్నారు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో చిరు నటిస్తుండగా వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వినాయక్ రీసెంట్ ఇంటర్వ్యూ లో చిరు కోసం ముఖ్యమంత్రి కథ ఒకటి రాసుకోగా ఠాగూర్ సినిమా చూపించి అది చేద్దాం అన్నారని.. అయితే రీమేక్ లో క్లైమాక్స్ తాను చిరు కోసం రాసుకున్న ముఖ్యమంత్రి కథలోని కొన్ని సీన్స్ యాడ్ చేశానని అవి బాగా వర్క్ అవుట్ అయ్యాయని చెప్పారు వినాయక్. చిరుతో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కెరియర్ లో పవన్, మహేష్ లతో సినిమా చేసే ఛాన్స్ రాలేదని.. అలా సడెన్ గా కాంబో సెట్ అయితే తప్పకుండా వారితో చేస్తానని అన్నారు వినాయక్.