దసరాకి బాలకృష్ణ 'నర్తనశాల' రిలీజ్

నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా నర్తనశాల. ఈ సినిమా షూటింగ్ టైం లోనే ఆపేశారు. సౌందర్య నటించిన ఆఖరి సినిమా ఇది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ అర్జునుడు పాత్రలో నటించిన ఈ సినిమా ఈ దసరాకి రిలీజ్ చేస్తున్నారు. రష్ అంతా ఎడిట్ చేస్తే కేవలం 17 నిమిషాల సినిమా వచ్చిందని తెలుస్తుంది.

శ్రేయాస్ ఈటిలోకి వెళ్లి.. ఎన్.బి.కె థియేటర్ లో వాళ్లు నిర్ణయించిన మొత్తం చెల్లించి ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని చారిటీకి అందే ఏర్పాటు చేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ నెల 24న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో అర్జునుడు పాత్రలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. మరి ఈ షార్ట్ అండ్ స్వీట్ నర్తనశాల ఎలా ఉంటుందో చూడాలి.