హైదరాబాద్ వరద బాధితుల కోసం తారల విరాళాలు

భారీ వర్షాలు హైదరాబాద్ ప్రజలను కష్టాలపాలయ్యేలా చేశాయి. భాగ్యనగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఈ వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోగా.. కొందరికి ఆస్తి నష్టం జరిగింది. తెలంగాణా ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా 550 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఇక సినీ ప్రముఖులను తమ వంతు సాయం చేయాల్సిందిగా కోరింది తెలంగాణా ప్రభుత్వం. 

ప్రభుత్వానికి సహాయంగా సిఎం సహాయ నిధికి అండగా నిలుస్తున్నారు తెలుగు హీరోలు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. మహేష్ కోటి, చిరంజీవి కోటి, నాగార్జున, ఎన్.టి.ఆర్ 50 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ దేవరకొండ 10 లక్షలు విరాళాలు ప్రకటించారు. 

ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తమ వంతు సాయం చేసేందుకు స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. హైదరాబాద్ వరద బాధితులకు సహాయంగా అందరికంటే ముందు నందమూరి బాలకృష్ణ కోటిన్నర విరాళం ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.