ఆ బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి

శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్ గా 800 టైటిల్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయిననాటి నుండి తమిళనాడులో గొడవలు మొదలయ్యాయి. విజయ్ సేతుపతి ఆ సినిమాలో నటించడానికి వీలు లేదని తమిళ సంఘాలతో పాటుగా కొందరు సిని సెలబ్రిటీస్ సైతం చెప్పారు. ఎమ్మెస్ శ్రీపతి డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

తన బయోపిక్ పై వస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ముత్తయ్య మురళీధరణ్. నా బయోపిక్ 800తో తమిళనాడులో వివాదాలకు దారి తీసింది. నా చుట్టూ ఉన్న తప్పుడు భావనల కారణంగా నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకోవాలని కొందరు అంటున్నారని నాకు తెలుసు.. నా వల్ల తమిళనాడుకు చెందిన గొప్ప కళాకారుడు బాధపడాలని నేను కోరుకోను.. దీనికి కారణంగా అతని కెరియర్ లో అవసరమైన అడ్డంకులు కలగకూడదని.. అందుకే అతన్ని ఈ సినిమా నుండి తప్పుకోవాలని అభ్యర్ధిస్తున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు. దీనికి స్పందించిన విజయ్ సేతుపతి థ్యాక్యూ గుడ్ బై అని అన్నారు. మొత్తానికి 800 సినిమా నుండి విజయ్ సేతుపతి బయటకు వచ్చారు.