అనుపమకే ఆ లక్కీ ఛాన్స్

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కు ఫైనల్ గా ఓ లక్కీ ఛాన్స్ వచ్చింది. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనకపడ్డ అనుపమకు సుకుమార్ సినిమా ఛాన్స్ వచ్చింది. సుకుమార్ నిర్మాణంలో సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా 19 పేజెస్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

కుమారి 21ఎఫ్ తో డైరక్టర్ గా సత్తా చాటిన సూర్య ప్రతాప్ తన నెక్స్ట్ సినిమాను 18 పేజెస్ అంటూ వస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ కథ అందిస్తున్నాడని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ రాక్షసుడుతో హిట్ అందుకున్న అనుపమ 18 పేజెస్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది.