నాగ శౌర్య కొత్త మూవీ

యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పార్ధు టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా పిరియాడికల్ మూవీగా వస్తుంది. ఈ సినిమాలో నాగ శౌర్య విలుకాడుగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నూతన దర్శకుడితో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇది కాకుండా లేటెస్ట్ గా నాగ శౌర్య అనీష్ కృష్ణ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అలా ఎలా, లవర్ సినిమాలను డైరెక్ట్ చేసిన అనీష్ కృష్ణ నాగ శౌర్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. ఈ ఇయర్ మొదట్లో అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. మరి రానున్న సినిమాలతో అయినా నాగ శౌర్య తన సత్తా చాటుతాడేమో చూడాలి.