
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా మార్టిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మొన్నటిదాకా తెలుగు హీరోయిన్ అంజలి ఈ సినిమాలో నటిస్తుందని అన్నారు. కాని ఫైనల్ గా మళయాళ భామని సెలెక్ట్ చేశారు. మళయాళంలోనే కాదు తమిళంలో కూడా ప్రగ్యా తన సత్తా చాటుతుంది. అందం అభినయంతో ఆమె ఆకట్టుకుంటుంది. అయితే బాలయ్య బాబు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
ఇక బాలకృష్ణ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. ఒక పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. బోయపాటితో బాలయ్య బాబు హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. సినిమాకు రెండు మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నా సరే చిత్రయూనిట్ మాత్రం టైటిల్ రివీల్ చేయలేదు. దసరా కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని తెలుస్తుంది.