దసరాకి ముహుర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతునన ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చిరు మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్, తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ చేస్తున్నాడని తెలుస్తుంది. వేదాళం రీమేక్ మెహర్ రమేష్ డైరక్షన్ లో వస్తుందని టాక్.

ఈ సినిమాకు సంబందించిన ముహుర్తం దసరాకి పెట్టుకోనున్నారని తెలుస్తుంది. చిరు 153వ సినిమాకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాను తెలుగులో చిరు ఇమేజ్ కు సరిపడేలా మార్చి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. డైరక్టర్ గా కెరియర్ లో వెనకపడ్డ మెహర్ రమేష్ కు చిరు లక్కీ ఛాన్స్ ఇస్తున్నాడు. మరి ఈ ఛాన్స్ తో మెహర్ రమేష్ తన టాలెంట్ చూపిస్తాడో లేదో చూడాలి.