శోభన్ బాబు బయోపిక్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ అందగాడు స్టార్ హీరో శోభన్ బాబు బయోపిక్ సినిమా డిస్కషన్స్ లో ఉంది. శోభన్ బాబు బయోపిక్ కోసం ఓ బడా నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ బయోపిక్ లో దగ్గుబాటి వారసుడు రానా నటిస్తాడని టాక్. శోభన్ బాబు పాత్రలో రానా అనగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది.

అయితే రానా మాత్రం తను శోభన్ బాబు పాత్రలో నటించే ఆలోచనలో లేడని అంటున్నారు. ఇంతకీ శోభన్ బాబు బయోపిక్ లో ఏం చూపించబోతున్నారు. హీరోగానే రిటైర్ అయిన శోభన్ బాబు జీవిత కథను తెర మీద ఆవిష్కరించేది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో నటించిన అరణ్య సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.