
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కరోనా లాక్ డౌన్ టైంలో చేసిన సినిమాల్లో థ్రిల్లర్ కూడా ఒకటి. అప్సరా రాణి అందాల విందుతో వచ్చిన ఈ సినిమా ఏటిటిలో రిలీజైంది. ఆర్జీవి మార్క్ ప్రమోషన్స్ తో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది అని చెప్పడం కొద్దిగా కష్టమే. అయితే ఆర్జీవి సినిమా వల్ల ఆమె పాపులర్ అయ్యింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమెకు తెలుగులో మంచి ఛాన్సులు వస్తున్నాయి. మాస్ మహరాజ్ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అప్సరా రాణికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అప్సరా రాణికి కచ్చితంగా ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు. థ్రిల్లర్ కు ముందు రెండు సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ ఆర్జీవి సినిమా వల్ల వచ్చింది. ఇక రవితేజ సినిమాలో సాంగ్ క్లిక్ అయితే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే. క్రాక్ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.