నందిని రెడ్డి.. సమంత.. హ్యాట్రిక్ మూవీ..!

లేడీ డైరక్టర్ నందిని రెడ్డి స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. నందిని రెడ్డి డైరక్షన్ లో సమంత చేసిన జబర్దస్త్ ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు కలిసి ఓ బేబీ సినిమా చేశారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

ఇక ఓ బేబీ తర్వాత మరోసారి సమంతతో సినిమాకు రెడీ అవుతుందట డైరక్టర్ నందిని రెడ్డి. ఈ ఇద్దరి హ్యాట్రిక్ కాంబోలో సినిమా వస్తుందని తెలుస్తుంది. హర్రర్ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. జాను సినిమా తర్వాత సమంత నెక్స్ట్ సినిమా కన్ఫాం చేయలేదు. నందిని రెడ్డితో సినిమా కోసమే ఆమె రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న మూడవ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.