
మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ సితార ఎంటర్టైన్మెంట్స్ ఆ సినిమా రీమేక్ రైట్స్ కొనేశారు. ముందు బాలకృష్ణ, రానా చేస్తారని అనుకున్న ఈ సినిమాలో రవితేజ, రానా చేస్తారని అన్నారు. కాని ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ లోకి పవర్ స్టార్ ఎంట్రీ ఇవ్వడంతో లెక్కలన్ని మారిపోయాయి.
అయ్యప్పనుం కోషియం సినిమా చూసిన పవన్ ఆ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పవన్, రానా కలిసి ఈ మూవీ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు త్రివిక్రం మాటలు అందిస్తారని అంటున్నారు. సినిమాను డాలి డైరెక్ట్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి సూపర్ హిట్ మూవీ రీమేక్ కు దాదాపు అంతా సెట్ చేశారట నిర్మాతలు. అయితే పవన్ వరుస సినిమాలు సైన్ చేశాడు. వాటిని ముగించుకున్న తర్వాతే ఈ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మళయాళంలో పృధ్వి రాజ్, బిజూ మీనన్ చేసిన పాత్రల్లో రానా, పవన్ కనిపిస్తారని అంటున్నారు. మరి ఈ క్రేజీ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి.