ఆ డైరక్టర్ కథను రిజెక్ట్ చేసిన చరణ్..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ఆల్రెడీ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ చేసుకున్నాడు. కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో ఒక సినిమా ప్లాన్ చేయగా.. త్రివిక్రం తో సినిమా కూడా లైన్ లో పెట్టాడు. రాం చరణ్ మాత్రం ఇంకా కథా చర్చల్లోనే ఉన్నాడు. రీసెంట్ గా ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల చరణ్ కోసం ఓ కథ రెడీ చేసినట్టు వార్తలు వచ్చాయి. చరణ్ ను కలిసి వెంకీ కథ వినిపించాడట. స్క్రీన్ ప్లే మీద నడిచే సినిమాగా అనిపించడంతో వర్క వుట్ అవుతుందా లేదా అనే ఆలోచనతో వెంకీని రిజెక్ట్ చేశాడట రాం చరణ్.  

అయితే లైన్ చెప్పి ఓకే చేయించుకోవాలని అనుకున్న వెంకీ కుడుముల ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అయితే ఫైనల్ గా మరోసారి ఫుల్ స్క్రిప్ట్ తో కలిసి డిస్కస్ చేయాలని చూస్తున్నాడట. చరణ్ చెప్పిన కొన్ని సలహాలు కూడా తీసుకున్నట్టు టాక్. ఒకవేళ రెండోసారి కూడా కథ నచ్చకపోతే మాత్రం ఈ కాంబో సినిమా మిస్ అయినట్టే. ట్రిపుల్ ఆర్ తర్వాత రాం చరణ్ ఎవరితో చేస్తాడు అన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.