
విక్ట్రీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. వింటేజ్ వెంకటేష్ ను మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేశాడు అనీల్ ఆ విషయంలో అతని టాలెంట్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి ఆ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలాఉంటే ప్రస్తుతం ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్-3 మూవీని చేస్తున్నాడు అనీల్ రావిపుడి. ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరో కమ్ కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నట్టు టాక్. కమెడియన్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత హీరోగా మారి ఆ సరదా కూడా తీర్చుకున్న సునీల్ మళ్ళీ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఎఫ్-3లో సునీల్ పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. అనీల్ రైటింగ్ కు సునీల్ కామెడీ తోడైతే ఇక ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వడం ఖాయమని చెప్పొచ్చు.