
ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్. ఈ సినిమాను టీ సీరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని తెలిసిందే. ప్రభాస్ స్ట్రైట్ గా బాలీవుడ్ లో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తాడని అంటున్నారు.
ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగన్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్టు తెలిసినే.. ఆదిపురుష్ లో కూదా ఆయనకు ఒక స్పెషల్ రోల్ ఇచ్చారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో అజయ్ దేవగన్ లార్డ్ శివ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. మొత్తానికి ఆదిపురుష్ లో ఆర్.ఆర్.ఆర్ స్టార్ అజయ్ దేవగన్ భాగమవడం రెండు సినిమాలపై అంచనాలు పెంచింది.