
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా తన సత్తా చాటాడు నవీన్ పొలిశెట్టి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా మరో సినిమా చేస్తున్నట్టు టాక్. స్వరూప్ డైరక్షన్ లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఆ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న నవీన్ స్వప్నా సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అంతేకాదు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కథలో నవీన్ నటిస్తున్నట్టు టాక్.
కొరటాల శివ కథతో అతను నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో హీరోగా నవీన్ ను సెలెక్ట్ చేశారట. ఈ వెబ్ సీరీస్ కథ, నిర్మాణ బాధ్యతలు రెండు కొరటాల శివ చూసుకుంటున్నారని తెలుస్తుంది. టాలెంట్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో ఈ వెబ్ సీరీస్ ప్లాన్ చేశారట కొరటాల శివ. తప్పకుండా కొరటాల శివ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ తో కూడా నవీన్ తన స్టామినా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.