
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నుండి మరో సర్ ప్రైజ్ వచ్చింది. సినిమాలో ఇప్పటికే దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని తెలియగా లేటెస్ట్ గా సినిమాలో బిగ్ బి అమితాబ్ ని కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. లెజెండరీ యాక్టర్ అమితాబ్ ప్రభాస్ 21వ సినిమాలో నటిస్తాడని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమా టైటిల్ గా నాగ్ అశ్విన్ బిగ్ బి అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 500 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు టాక్. ప్రభాస్ 21 సినిమాకు బిగ్ బి టైటిల్ ఫిక్స్ చేస్తారా లేక మరేదైనా పెడతారా అన్నది చూడాలి.