
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు లేటెస్ట్ గా పెళ్లిసందడి సినిమా ఎనౌన్స్ చేశాడు. రాఘవేంద్ర రావు డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమా టైటిల్ తో ఇప్పుడు అదే డైరక్టర్ మరో సినిమా ఎనౌన్స్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. సినిమాలో నటీనటులు త్వరలో వెళ్లడిస్తామని అన్నారు. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ లేటెస్ట్ పెళ్లిసందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడిని హీరోగా సెలెక్ట్ చేసినట్టు టాక్.
నిర్మలా కాన్వెంట్ తో తెరంగేట్రం చేసిన రోషన్ కెరియర్ లో కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు. శ్రీకాంత్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు రోషన్. రాఘవేంద్ర రావు ఈ సినిమాను చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. శ్రీకాంత్ తనయుడుతో రాఘవేంద్ర రావు పెళ్లిసందడి ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.