గుణశేఖర్ 'శాకుంతలం'

టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్స్ లో ఒకరైన గుణశేఖర్ తన సినిమా అంటే చాలు ఆడియెన్స్ కు ఐ ఫీస్ట్ అన్నట్టే.. భారీ సెట్టులు.. హంగులతో సినిమా నిండుగా ప్లాన్ చేస్తాడు. రుద్రమదేవి సినిమాకు దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా కష్టపడిన గుణశేఖర్ ఆ సినిమాతో టాలెంట్ చూపాడు. అయితే ఆ తర్వాత దగ్గుబాటి రానాతో హిరణ్యకశ్యప సినిమా ఎనౌన్స్ చేసిన గుణశేఖర్ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశాడు. అయితే గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమా చేస్తాడని అనుకోగా తన కొత్త సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు గుణశేఖర్. 

శాకుంతలం టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశాడు గుణశేఖర్. మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ అంటూ శాకుంతలం మోషన్ పోస్టర్ తో వచ్చాడు గుణశేఖర్. ఈ సినిమాను కూడా గుణ టీం వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మోషన్ పోస్టర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.