
బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. అయితే తను చేయాల్సిన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున థాయ్ ల్యాండ్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ రెండు వారాల పాటు షూటింగ్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. అయితే ప్రతి వీకెండ్ బిగ్ బాస్ షో హోస్ట్ గా నాగార్జున కనిపించాల్సి ఉంటుంది. అయితే హోస్ట్ గా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున రెండు వారాలు బ్రేక్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ రెండు ఎపిసోడ్స్ కు శివగామి రమ్యకృష్ణ హోస్ట్ గా వస్తారని టాక్.
లాస్ట్ సీజన్ లో కూడా నాగార్జున బదులుగా ఒక వీకెండ్ రమ్యకృష్ణ వచ్చి అలరించారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందని తెలుస్తుంది. ఈమధ్యనే యాభై ఏళ్ళు వచ్చినట్టు కన్ఫాం చేసిన రమ్యకృష్ణ ఇప్పటికి సూపర్ ఫాంలో ఉన్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో తన సత్తా చాటింది రమ్యకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 4లో నాగార్జున బదులుగా రమ్యకృష్ణ వస్తుద్నని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.