కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ : రాజ్ తరుణ్

డైరక్టర్ గా మారాలనుకున్న వారు హీరోలుగా.. హీరోలు అవ్వాలనుకున్న వారు డైరక్టర్స్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో యువ హీరోల్లో కొందరు డైరక్షన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి హీరోలుగా మారారు. అంటే ముందు సినిమాకు పనిచేయాలని అసిస్టెంట్ డైరక్టర్ చేరి తమ టాలెంట్ తో హీరోగా మారారన్నమాట. నాని, రాజ్ తరుణ్ ఈ కోవలోకి వస్తారు.

నాని కూడా డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేస్తూ హీరోగా మారాడు. ఇక రాజ్ తరుణ్ కూడా షార్ట్ ఫిలంస్ చేస్తూ.. డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరి ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. వారు హీరోలుగా మారిన తమలో డైరక్టర్ అలానే ఉన్నాడు. ఇటీవల ఇంటర్వ్యూలో డైరక్షన్ చేస్తే ఏ హీరోతో చెస్తావని రాజ్ తరుణ్ ను అడిగితే.. అల్లు అర్జున్, సునీల్ అని ఆన్సర్ ఇచ్చాడు. సో వారిద్దరి కోసం రాజ్ తరుణ్ ఏదైనా కథ అనుకున్నాడేమో తెలియదు కాని డైరక్షన్ చేస్తే మాత్రం ఆ ఇద్దరితో ఒకరిని హీరోగా పెట్టి చేస్తా అంటున్నాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ఆహాలో రిలీజైంది.