పవన్.. రానా.. మల్టీస్టారర్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి క్రేజీ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న అయ్యప్పనుం కోషియం రీమేక్ లో ఫైనల్ గా పవన్ కళ్యాణ్, రానా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్.. ఆ సినిమా పూర్తి కాగానే క్రిష్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడట.. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ రెండిటి తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. ఇవన్ని పూర్తయ్యాక మళయాళ సినిమా రీమేక్ వస్తుందని తెలుస్తుంది. 

ఈ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. మళయాళంలో పృధ్వి రాజ్, బిజూమీనన్ ఈ సినిమాలో నటించారు. తెలుగు రీమేక్ లో పవన్, రానా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మల్టీస్టారర్ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయాలు తెలియాల్సి ఉంది.