త్రివిక్రం తో మహేష్ సినిమా.. ఈ ట్వీట్ చూస్తేనే అర్ధమవుతుంది..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ అతడుతో సూపర్ హిట్ అందుకుని.. ఖలేజాతో కమర్షియల్ గా ఫ్లాప్ అనిపించుకున్నా ఆడియెన్స్ మనసు గెలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో మహేష్ ను దేవుడిని చేస్తూ త్రివిక్రం రాసిన మాటలు సూపర్ అని చెప్పాలి. ఈరోజుకి ఈ సినిమా రిలీజై పదేళ్ళు పూర్తవుతున్న ఈ సినిమా గురించి మహేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. 

నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకునేలా చేసిన సినిమా.. నా కెరియర్ లో స్పెషల్ మూవీ.. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నా స్నేహితుడు, తెలివైన త్రివిక్రంకు ధన్యవాదములు. మనం మళ్ళీ త్వరలోనే కలిసి పనిచేద్దాం అని మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ తో త్రివిక్రం సినిమాపై కొన్నాళ్లుగా మీడియాలో డిస్కషన్స్ వస్తున్నాయి. అయితే మహేష్ ట్వీట్ చేసరికి ఈ కాంబో రిపీట్ అవుతుందని తెలుస్తుంది.