
టాలీవుడ్ లో అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. రౌడీ హీరోగా విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా ఓ నూతన దర్శకుడితో చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటిస్తుందని తెలుస్తుంది.
నిశ్శబ్ధం తర్వాత రెండు సినిమాలకు సైన్ చేశానని చెప్పింది అనుష్క. అందులో విజయ్ దేవరకొండ సినిమా ఒకటని ఫిక్స్ అయ్యారు ఆడియెన్స్. మాములుగా తన సినిమాల్లో హీరోయిన్స్ తో రొమాన్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయే విజయ్ దేవరకొండ అనుష్కతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్న ఎక్సయిటింగ్ లో ఉన్నారు ప్రేక్షకులు. మరి ఈ కాంబో సినిమాపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.