నితిన్ రంగ్ దే భలే దూసుకెళ్తున్నారు..!

లవర్ బోయ్ నితిన్ ఈ ఇయర్ మొదట్లో భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడ్డ షూటింగ్ ఈమధ్యనే మొదలైంది. ఇక నిన్నటితో ఈ సినిమాకు అనుకున్న షెడ్యూల్ పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. లాక్ డౌన్ తర్వాత 20 రోజుల స్మాల్ షెడ్యూల్ పూర్తి చేశాడు డైరక్టర్ వెంకీ అట్లూరి. ఎనదర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని టీంతో నితిన్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.