20 రోజులు టైం ఇచ్చిన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిరంస్తుండగా. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ 20 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చెప్పాడట పవన్.

సినిమాలో నివేదా థామస్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ చేసిన ఈ సినిమను తెలుగులో పవన్ చేయడం విశేషం. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అయినా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సినిమా నచ్చే అంశాలు కూదా ఇందులో ఉంటాయని అంటున్నారు. 2021 సంక్రాంతి రేసులో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమా అనుకున్న టైం లో పూర్తి చేస్తారా లేదా అన్నది చూడాలి. ఈ నెల చివర నుండి పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటార్ని టాక్.