
సౌత్ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ చందమామ పెళ్ళి కబురుతో షాక్ ఇచ్చింది. కొన్నాళ్ళుగా కాజల్ పెళ్ళిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా సైలెంట్ గా ఉన్న కాజల్ ఏకంగా పెళ్ళి డేట్ ఇదే అంటూ చెప్పి సర్ ప్రైజ్ చేసింది. అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ పెళ్ళి జరుగనుంది. బిజినెస్ మెన్ గౌతం కిచ్లుతో కాజల్ పెళ్ళి ఫిక్స్ అయ్యింది.
ఇన్నాళ్ళు తనపై చూపించిన ప్రేమను ఇక మీదట కూడా కొనసాగిస్తారని. గౌతం కిచ్లుతో ఈ నెల 30న తాను పెళ్ళికి సిద్ధమైనట్టు కాజల్ తన సోషల్ బ్లాగుల్లో స్పెషల్ మెసేజ్ పెట్టింది. రెండు రోజులుగా కాజల్ పెళ్ళి చేసుకునే వరుడు ఇతనే అంటూ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు కాజల్ కూడా ఆ వార్తలన్నిటిని నిజమే అని చెప్పి షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా చేస్తుంది. కోలీవుడ్ లో ఇండియన్ 2 సినిమాలో కూడా ఆమె ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత కాజల్ కొద్దిపాటి గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
<blockquote class="twitter-tweet"><p lang="und" dir="ltr">♾ <a href="https://t.co/3qjCX9hAe1">pic.twitter.com/3qjCX9hAe1</a></p>— Kajal Aggarwal (@MsKajalAggarwal) <a href="https://twitter.com/MsKajalAggarwal/status/1313357505724997633?ref_src=twsrc%5Etfw">October 6, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>