
ప్రభాస్ మిర్చి సినిమాతో ప్రొడక్షన్ హౌజ్ మొదలు పెట్టిన యువి క్రియేషన్స్ క్రేజీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. యువి నుండి సినిమా వస్తే అది పక్కా హిట్ అనేంత కాన్ఫిడెన్స్ ఏర్పడింది. యువి క్రియేషన్స్ ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వరుస మెగా ప్రాజెక్టులు చేస్తున్నట్టు తెలుస్తుంది.
భీష్మ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమా రాం చరణ్ తో చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారని టాక్. ఇక మరో పక్క మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందట. ఆ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇలా మెగా బ్రదర్స్ ఇద్దరితో సినిమాలు చేస్తూ యువి క్రియేషన్స్ వేసిన మెగా ప్లాన్ అదిరిందని చెప్పొచ్చు.