
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్యనే తమన్నా పేరెంట్స్ కరోనా బారిన పడగా మూడు వారాల్లో వారికి మళ్ళీ నెగటివ్ వచ్చినట్టు సమాచారం. ఇక లేటెస్ట్ గా తమన్నాకు ఫీవర్ రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. ప్రస్తుతం తమన్నా హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేసుకుంటున్నారు.
ఓ వెబ్ సీరీస్ షూటింగ్ లో పాల్గొనేందుకు తమన్నా హైదరాబాద్ వచ్చిందట. ఆ షూటింగ్ లో పాల్గొన్న టైం లో తమన్నాకు ఫీవర్ వచ్చిందట. తమన్నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే ఆమె పాల్గొన్న వెబ్ సీరీస్ షూటింగ్ లోని సభ్యులందరు టెస్టులు చేయించుకున్నట్టు తెలుస్తుంది. సౌత్ హీరోయిన్స్ లో తమన్నా మొదట కరోనా బారిన పడ్డారు.