
కోలీవుడ్ యాక్టర్ ప్రభు కరోనా బారిన పడ్డారని వస్తున్న వార్తలకు ఆయన స్పందించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వస్తున్న వర్తలో వాస్తవం లేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్ని రూమర్స్ అని చెప్పారు ప్రభు. కాలు బెణికి హాస్పిటల్ కు వెళ్తే కరోనా కారణంగా వెళ్లానని రాసేస్తున్నారని అన్నారు ప్రభు. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. అక్టోబర్ 1న ప్రభు తండ్రి లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ జయంతి కార్యక్రమంలో ప్రభు కనిపించలేదు. అందుకు తనకు కరోనా రావడం వల్లే బయటకు రాలేకపోయానని వార్తలు రాశారు. కాలు బెణకడం వల్ల కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పాను కాని తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నట్టు ప్రకటించారు ప్రభు.