
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ వెళ్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్తున్నారు చిత్రయూనిట్. అక్కడ ఓ 15 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని వస్తారట. అక్టోబర్ మొదటి వారం నుండి ఇటలీలో రాధే శ్యామ్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. మళ్ళీ నవంబర్ ఫస్ట్ వీక్ లో చిత్రయూనిట్ తిరుగు ప్రయాణం చేయనున్నారట.
పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధే శ్యామ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అందిస్తారు అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచిన రాధే శ్యామ్ 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.