
బాహుబలి తర్వాత రాజమౌళి RRR సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్నారు. రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఎలా ఉంటుందో అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఫ్యామిలీ కూడా అందులో భాగమవ్వాల్సిందే. ఆయన ప్రతి సినిమాకు కీరవాణి మ్యూజిక్, శ్రీవల్లి ప్రొడక్షన్ డిజైనర్ గా ఉంటారు. ఇక రమా రాజమౌళి కాస్టూమ్స్ డిజైనర్ గా పనిచేస్తారు. కార్తికేయ కూడా సెకండ్ యూనిట్ డైరక్టర్ గా ఉంటాడు. రాజమౌళితో సై సినిమా నుండి పనిచేస్తున్నాడు కెమెరా మెన్ సెంథిల్ కుమార్. అతను కూడా రాజమౌళి ఫ్యామిలీలో భాగమే.
ఇలా జక్కన్న సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం పనిచేస్తారు. అంతేకాదు ఈ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ప్యాకేజ్ మాట్లాడుకుంటారని తెలుస్తుంది. RRR కోసం వీళ్ళందరికి కలిపి రెమ్యునరేషన్ గా 75 కోట్లు తీసుకుంటున్నారని టాక్. కచ్చితంగా ఈ రెమ్యునరేషన్ విని షాక్ అవ్వాల్సిందే. డైరక్టర్ గా తను ఎంత తీసుకుంటాడు మిగతా వారికి ఎంత ఇస్తాడో తెలియదు కాని రాజమౌళి సినిమా అంటే ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ మాత్రం ఉండాల్సిందే అట. ఎంత ఇచ్చినా దానికి డబుల్ ట్రిపుల్ తెస్తాడు కాబట్టి ఆ విషయంలో నిర్మాతలు వెనక్కి తగ్గేది లేదని తెలుస్తుంది.