నితిన్ సినిమా 40 కోట్లు డిమాండ్..?

ఈ ఇయర్ మొదట్లో భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమాను వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్నాడు. రంగ్ దే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో సింగిల్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంటుందని తెలుస్తుంది. 

ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఓటిటిల నుండి ఫ్యాన్సీ ఆఫర్స్ కూడా వస్తున్నాయట. అన్నిటికన్నా జీ 5 నితిన్ రంగ్ దే సినిమాకు ఎక్కువ కోట్ చేసిందని తెలుస్తుంది. డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలా మొత్తం కలిపి రంగ్ దే సినిమాకు 36 కోట్ల దాకా ఆఫర్ చేశారట. నితిన్ నిర్మాతలు మాత్రం 40 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ చేసినా ఆ రేంజ్ కలక్షన్స్ రాబట్టడం కష్టం అందుకే ఓ రెండు అటో ఇటో ఓటిటికే నితిన్ రంగ్ దే డీల్ క్లోజ్ అయ్యేలా సెట్ చేస్తున్నారట. మరి రంగ్ దే రిలీజ్ పై అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.