
మాస్ అండ్ కమర్షియల్ హీరోగా కొన్నాళ్ళు సందడి చేసిన గోపిచంద్ ప్రస్తుతం కెరియర్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. చేస్తున్న సినిమాల కథలు బాగుంటున్నా ఒకేరకమైన సినిమాల్లా అనిపించడంతో గోపిచంద్ సినిమాల మీద ఆడియెన్స్ ఆసక్తి తగ్గిపోయింది. ప్రస్త్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్నాడు గోపిచంద్. ఈ సినిమాతో ఎలగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు గోపిచంద్.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను 2021 సంక్రాంతి రేసులో దించాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఆల్రెడీ సంక్రాంతికి అఖిల్ బ్యాచ్ లర్, నితిన్ రంగ్ దే ఖర్చీఫ్ వేసేశారు. వారిద్దరికి పోటీగా గోపిచంద్ సినిమా వస్తుందని తెలుస్తుంది. అంతేకాదు మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ కూడా పొంగల్ వార్ లో ఉంటుందని టాక్. మరి ఈ సినిమాల్లో ఏది సంక్రాంతి పోటీల్లో నిలుస్తుంది అన్నది అప్పుడే తెలుస్తుంది.