
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్ళి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. కథల సెలక్షన్స్ లో పంథా మార్చిన సమంత జాను తర్వాత తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. కోలీవుడ్ లో మాత్రం విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాలో నయనతార కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం గేమ్ ఓవర్ డైరక్టర్ అశ్విన్ తో సమంత తెలుగు సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సమంత మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందని టాక్. అశ్విన్ చెప్పిన కథకు సమంత ఇంప్రెస్ అయ్యిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందట. ఇదే కాకుండా సమంత మరో రెండు సినిమాలను హోల్డ్ లో పెట్టిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంతకు తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. లాక్ డౌన్ టైం లో మేడ మీద కూరగాయలు పండించిన సామ్ రీసెంట్ గా క్లాతింగ్ బిజినెస్ కూడా మొదలుపెట్టింది.