మెగా బ్రదర్ నాగబాబుకి కరోనా

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉది. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా రోజుకి వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కోవిడ్ 19 కు అందరు ఒకటే అన్నట్టుగా సామాన్య ప్రజలతో పాటుగా సెలబ్రిటీస్, పొలిటిషియన్స్ మీద వీర ప్రతాపం చూపిస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెదిన వారికి కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ఇక లేటెస్ట్ గా మెగా బ్రదర్ నాగబాబుకి కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా బారిన పడిన విషయాన్ని నాగబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.   

కరోనా పాజిటివ్ వచ్చింది.. ఈ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటాను.. ఆ తర్వాత ప్లస్మా దానం చేస్తానని చెప్పారు నాగబాబు. నాగబాబు జీ తెలుగులో అదిరింది షోతో పాటుగా తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో వీడియోస్ పెడుతూ ఉన్నారు. అదిరింది షో షూటింగ్ టైంలోనే ఆయన కరోనా బారిన పడి ఉంటారని తెలుస్తుంది.