ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుకి కరోనా

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుకి కరోనా పాజిటివ్ అని తేలినట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నెల 9న కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని అయినా సరే ఆరోగ్యం బాగానే ఉన్నట్టు చెప్పారు సింగీతం శ్రీనివాసరావు. ఆరవై ఏళ్ళు పై బడిన వారి మీద కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందని డాక్టర్స్ సూచించారు. 65 ఏళ్ళ వయసులో కరోనా వచ్చినా తాను బాగానే ఉన్నానని అన్నారు సింగీతం శ్రీనివాస రావు.  

ప్రస్తుతం డాక్టర్స్ సలహా మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నానని.. ఈ నెల 23 వరకు హోం ఐసోలేషన్ లో ఉంటానని అన్నారు. తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సింగీతం శ్రీనివాస రావు త్వరలోనే కరోనా నుండి కోలుకోవాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.