దసరాకి వస్తున్న కలర్ ఫోటో..!

చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్ తో సూపర్ పాపులర్ అయిన సుహాస్ ఈమధ్య సినిమాల్లో హీరోల పక్కన పాత్రల్లో కనబడుతున్నాడు. కమెడియన్ గానే కాదు అతను ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తునాడు. ఛాయ్ బిస్కెట్ షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేసిన సందీప్ రాజ్ డైరక్షన్ లో కలర్ ఫోటో అంటూ క్రేజీ మూవీ చేశారు. టీజర్ తో మెప్పించిన ఈ సినిమా ఓటిటి ఆఫర్ కూడా అందుకుంది. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.   

ఆహా ఓటిటి ఫ్లాట్ ఫాంలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాను అక్టోబర్ 23న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దసరా టైం కు ఆడియెన్స్ కూడా ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. టీజర్ తో ప్రేక్షకులను మెప్పించిన కలర్ ఫోటో సినిమా కూడా ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ను ఇంటికొచ్చి మరి మీకు అందిస్తాం జస్ట్ మీరు టివి, ఫోన్, ల్యాప్టాప్ ఆన్ చేస్తే చాలు అంటూ డైరక్టర్ సందీప్ చెప్పుకొచ్చారు.