పవర్ స్టార్ 'ఓం శివమ్'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. వకీల్ సాబ్ రిలీజ్ కాగానే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. ఆల్రెడీ క్రిష్ సినిమాకు 15 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్ డే రోజుల ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.    

ఈ సినిమాకు మొదట్లో విరూపాక్ష.. ఆ తర్వాత గజదొంగ, బందిపోటు లాంటి టైటిల్స్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి ఓం శివమ్ టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ సినిమా సెట్స్ మీద ఉంటే ఎవరికి తోచినట్టుగా వారు వార్తలు రాసేస్తుంటారు. మరి ఈ టైటిల్ క్రిష్ టీం నుండి వచ్చిందా లేక రూమరా అన్నది తెలియాల్సి ఉంది. వకీల్ సాబ్ పూర్తి కాగానే పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.