సర్కారు వారి పాట.. అదిరిపోయే బిజినెస్..!

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినీమలో కీర్త్ సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమా ప్రీ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ కాగా అప్పుడే సినిమాకు డిజిటల్, శాటిలైట్ రైట్ డీల్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. మహేష్ స్టామినా తెలిసేలా సర్కారు వారి పాట సినిమా బిజినెస్ ఉందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 35 నుండి 40 కోట్ల దాకా పలుకుతున్నాయట.  

సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళకుండానే మహేష్ సినిమా బిజినెస్ అదరగొడుతుంది. అంతేకాదు సినిమాకు ఇంకా హిందీ రైట్స్ కూడా భారీగానే జరిగేలా ఉందట. 2021 జనవరిలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమా మరోసారి మహేష్ స్టామినా ప్రూవ్ చేసింది.