మహేష్ బాబు న్యూ లుక్.. సోషల్ మీడియాలో ట్రెండ్..!

సూపర్ స్టార్ న్యూ లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. లాక్ డౌన్ టైంలో మహేష్ మరింత అందంగా తయారయ్యాడు. లేటెస్ట్ గా ఓ యాడ్ షూట్ కోసం మహేష్ అన్నపూర్ణ స్టూడియోస్ కు రాగా మహేష్ స్టైలిష్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాడ్ కోసం చేసిన ఫోటో షూట్ లో భాగంగా తీసిన ఆ పిక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ అందగాడు.. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు అనేది మహేష్ విషయంలో మరోసారి ఈ పిక్ ప్రూవ్ చేసింది.

అంతేకాదు 45 ఏళ్ళ వయసు ఉన్న మహేష్ ఈ రేంజ్ లో ఫిట్ గా ఉండటం కూడా మిగతా స్టార్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. లాక్ డౌన్ టైంలో ఇంట్లో తన కాజువల్ లుక్స్ తో సర్ ప్రైజ్ చేసిన మహేష్ ఇప్పుడు ఈ కొత్త లుక్ లో అదరగొట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్నాయి.