
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేణు శ్రీరాం కాంబినేషన్ లో ఐకాన్ అంటూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. ఐకాన్ కనబడుట లేదు అంటూ ట్యాగ్ లైన్ తో వచ్చింది. ఈ సినిమా మొదలుపెట్టకుండానే అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత కొరటాల శివ సినిమాను లైన్ లో పెట్టాడు. ఇక ఈ సినిమాలతో బిజీ అయిన బన్నీ ఐకాన్ మూవీని పక్కన పడేశాడని అన్నారు.
వకీల్ సాబ్ విశేషాలు ప్రేక్షకులతో పంచుకున్న వేణు శ్రీరాం అల్లు అర్జున్ ఐకాన్ మూవీ గురించి కూడా స్పందించారు. ఐకాన్ సినిమా లేట్ అవుతుంది కాని ఎప్పటికైనా బన్నీతో ఆ సినిమా ఉంటుందని అంటున్నారు డైరక్టర్ వేణు శ్రీరాం. నా పేరు సూర్య తర్వాత ప్రయోగాలకు దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ ఐకాన్ సినిమా కూడా అలాంటి ప్రయోగాత్మక సినిమా అయ్యే సరికి చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. పుష్ప, కొరటాల శివ రెండు సినిమాలు హిట్ కొడితే అప్పుడు ఐకాన్ గురించి బన్నీ ఆలోచించే అవకాశం ఉంది. మొత్తానికి స్టైలిష్ స్టార్ ఐకాన్ పై వచ్చిన ఈ క్రేజీ అప్డేట్ అల్లు, మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.